'పెద్ది' టీమ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో!

  • 'పెద్ది' సూపర్ డూపర్ హిట్
  • జూన్ 4న విడుదలై రూ.345 కోట్లకు పైగా వసూళ్లు
  • విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా
  • ఈ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి
  • చిత్రబృందంపై ప్రశంసల వర్షం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా, ఇతర యూనిట్ సభ్యులు ఇవాళ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

జూన్ 4న విడుదలైన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించగా, అప్పలసూరి అనే ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సందర్భంగా చిరంజీవి తమను అభినందించిన ఫొటోలను 'పెద్ది' చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. "మెగాస్టార్ గారు 'పెద్ది' బ్లాక్‌బస్టర్ విజయంపై చిత్ర బృందాన్ని అభినందించారు" అని పోస్ట్‌లో పేర్కొంది.

Chiranjeevi
Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Peddi Box Office Collection
Janhvi Kapoor

More Telugu News